The Official Biography of Swami Rama (Telugu)

· Manjul Publishing
5 reviews
Ebook
372
Pages

About this ebook

ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తే ఉదాత్త స్థాయికి చెందిన గురు-శిష్య సంబంధాలు కొన్ని ఉంటాయి. స్వామీ రామ-బెంగాలీ బాబా మధ్య జరిగిన ఉదంతాలు, బెంగాలీ బాబా స్వామీ రామకి అనేకమంది గొప్ప గురువుల్ని పరిచయం చేసినప్పుడు ఆయనకి ఎదురైన అనుభవాలు, అలాగే స్వామీ రామ తన శిష్యులకిచ్చిన అనేక నిదర్శనాలే ఇందుకు ప్రమాణం. ఈ మార్మిక ఉదంతాలు భారతదేశంలో తరతరాలుగా వస్తున్న అమూల్య ఆధ్యాత్మిక వారసత్వ సంప్రదాయాల్ని పరిచయం చేస్తాయి. ఈ గ్రంథంలో వివరించబడిన భారతీయ యోగ, తంత్ర విద్యలు, అతీంద్రియ ప్రజ్ఞకి చెందిన మార్మిక సంఘటనలు పాశ్చాత్య ప్రపంచాన్ని ఉలికిపాటుకి గురి చేశాయి.
ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తే ఉదాత్త స్థాయికి చెందిన గురు-శిష్య సంబంధాలు కొన్ని ఉంటాయి. స్వామీ రామ-బెంగాలీ బాబా మధ్య జరిగిన ఉదంతాలు, బెంగాలీ బాబా స్వామీ రామకి అనేకమంది గొప్ప గురువుల్ని పరిచయం చేసినప్పుడు ఆయనకి ఎదురైన అనుభవాలు, అలాగే స్వామీ రామ తన శిష్యులకిచ్చిన అనేక నిదర్శనాలే ఇందుకు ప్రమాణం. ...

Discover more

Ratings and reviews

5 reviews
Koteswararao Annabattula
July 5, 2026
ఈ గ్రంథం గురు-శిష్య సంబంధంలోని ఆధ్యాత్మిక మహిమను అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. స్వామీ రామ అనుభవాలు, బెంగాలీ బాబా మార్గదర్శకత్వం, మహనీయ యోగుల సాన్నిధ్యం పాఠకుడిని ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. యోగ, తంత్రం, అతీంద్రియ అనుభవాలను ఆసక్తికరంగా వివరిస్తూ భారతీయ ఋషుల జ్ఞానపారంపర్య గొప్పతనాన్ని చాటుతుంది. ఆధ్యాత్మికతపై ఆసక్తి ఉన్నవారికి ఈ పుస్తకం ఆలోచనలను విస్తరించే, స్ఫూర్తినిచ్చే అమూల్యమైన గ్రంథం.
Did you find this helpful?
Swamy Dadari
July 31, 2026
good
Did you find this helpful?
My Book Store
April 17, 2021
The is Number Book
Did you find this helpful?

About the author

అత్యంత ప్రముఖ హిమాలయ సాధువుల్లో ఒకరైన స్వామీ రామ హిమాలయన్‌ ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌, యోగ ఇంటర్నేషనల్‌ మేగజైన్‌ సంస్థాపకులు. ఈ హిమాలయ సాధువు స్వామీ రామ జీవన సంగ్రహం రచయిత పండిట్‌ రాజమణి టిగునైట్‌, స్వామీజీ ఆధ్యాత్మిక వారసులు. వీరు స్వామీజీ జీవితం గురించీ, వారి ఆధ్యాత్మిక ప్రచార లక్ష్యం గురించీ ప్రామాణికమైన వివరాల్ని అందించారు. ఈ ఆధ్యాత్మిక జీవిత చరిత్రకి సంబంధించిన పుటలు ఒక అత్యద్భుతమైన పరమ గురువు జీవిత సంఘటల్ని తెలియజేయడం వరకే పరిమితం కాక, వాటిలోని తాత్విక మర్మాన్ని వివరిస్తాయి. జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ఉన్నత జీవిత లక్ష్యం వైపు మనం సాగించాల్సిన ప్రయాణం గురించి విశదీకరిస్తాయి. ఈ జీవిత చరిత్ర స్వామీజీ వ్యక్తిగత, ఆధ్యాత్మిక పయనాన్ని సమగ్రంగా వివరిస్తుంది. అలాగే వారి ప్రత్యక్ష గురుదేవులు బెంగాలీ బాబా గురించిన మార్మిక గాథల్ని ఎన్నో ఇందులో వివరించారు. మనం నివసిస్తున్న ఈ ఆధునిక యుగంలో ఈ మహత్తరమైన సంగతులు యోగం, తంత్రంలోని మార్మిక శక్తులు, ఉన్నత స్థాయిని పొందగలిగే పద్ధతుల్నీ వివరిస్తాయి. ఈ ఆధ్యాత్మిక జీవిత చరిత్ర మీకు హిమాలయ పరమగురువుల్లో ఒక మహత్తర సాధన చేసిన సిద్ధపురుషుని గురించి నిశితమైన సమగ్రమైన పరిచయం కలుగజేస్తుంది. నయనాలు చూసే పదాల ద్వారా ఇంద్రియాతీత విఙ్ఞానానికి గల శక్తిని ఈ కథలు మీకు అనుభవైకవేద్యం చేస్తాయి. హిమాలయ సంప్రదాయం గురించిన కాలాతీత గాఢతని వెలార్చే దివ్య తరంగం మీ మనసుని అలవోకగా తాకుతుంది. పండిట్‌ రాజమణి టిగునైట్‌, స్వామీ రామకి ఆధ్యాత్మిక వారసులు. హిమాలయన్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఆధ్యాత్మిక విషయాలను నిర్వహిస్తున్న సంస్థాధిపతి. పండిట్‌ టిగునైట్‌కి అలహాబాదు విశ్వవిద్యాలయం, అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి రెండు డాక్టరేట్‌ డిగ్రీలు ఉన్నాయి. వీరు గత 30 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా గొప్ప కీర్తి శిఖరాల్ని అందుకున్న ఆధ్యాత్మిక గురువు. వీరు పన్నెండుకి పైగా ఆధ్యాత్మిక గ్రంథాల్నివెలువరించారు.

అత్యంత ప్రముఖ హిమాలయ సాధువుల్లో ఒకరైన స్వామీ రామ హిమాలయన్‌ ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌, యోగ ఇంటర్నేషనల్‌ మేగజైన్‌ సంస్థాపకులు. ఈ హిమాలయ సాధువు స్వామీ రామ జీవన సంగ్రహం రచయిత పండిట్‌ రాజమణి టిగునైట్‌, స్వామీజీ ఆధ్యాత్మిక వారసులు. వీరు స్వామీజీ జీవితం గురించీ, వారి ఆధ్యాత్మిక ప్రచార లక్ష్యం గురిం...

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.